ఇటలీలో ఇల్లు కొనుక్కోవాలనుకుందా? ధర రూ.80 మాత్రమే

 వాస్తవం ప్రతినిధి: ఇటలీలో ఇల్లు కొనుక్కోవాలనుకుందా? ధర ఒక యూరో మాత్రమే, అంటే భారత కరెన్సీలో అటూఇటుగా రూ.80. అసలింతకీ విషయం ఏమిటంటే..ఆ దేశంలో ఉన్న సిసిలీ ద్వీపంలోని సంబూకా అనే గ్రామం ఈ ‘ఒక్క యూరోకే ఇల్లు పథకం’ ప్రకటించింది. నగరాలు, విదేశాలకు ప్రజలు వలస వెళ్లిపోతుండటం కారణంగా యూరప్‌లోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం సంబూకా కూడా ఇదే సమస్య ఎదుర్కొంటోంది. ఆ గ్రామంలో ఉండేవారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పుడు ఆ గ్రామ జనాభా సుమారు 5,800 మాత్రమే. జనాభా పెంచేందుకు ఆ గ్రామ పాలక సంస్థ ఓ ఉపాయం ఆలోచించింది. ఖాళీగా ఉన్న పాతబడిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇళ్లను యజమానుల దగ్గరి నుంచి కొనుగోలు చేసింది. వాటిని కొత్తవారికి ఒక్క యూరో ధరకే అమ్మాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివారైనా ఈ ఇళ్లను కొనుక్కొని, సంబుకాలో నివసించవచ్చు. అయితే, కొనుగోలు విషయంలో ఓ షరతు ఉంది. కొన్నవారు మూడేళ్లలోగా ఆ ఇళ్లకు మరమ్మతులు చేయించుకోవాలి. ఈ పనులకు ఖర్చు భారీగానే అయ్యే అవకాశం ఉంది.