హెచ్‌1బీ వీసా విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం మరోసారి హెచ్‌1బీ వీసా జారీ ప్రకియను కఠినం చేసింది. హెచ్‌1 బీ విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా అప్లై చేసుకునే కాల పరిమతిని తగ్గించింది అగ్రరాజ్యం. ఈ నిర్ణయంతో చాలా మంది విదేశీయులు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది యూఎస్‌ ఎంబసీ.

 అమెరికా కి సంబందించి హెచ్‌1బీ వీసా ద్వారా ఎక్కువ మంది భారతీయులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ వీసా జారీ ప్రక్రియలో అమెరికా ఎన్నో అంక్షలు విధిస్తోంది. ఈ వీసా ద్వారా అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య పెరిగిపోతుందని, ఫలితంగా అమెరిన్లకు నష్టం వాటిల్లుతోందని చెబుతూ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.