పవన్ విషయంలో రామ్ చరణ్ పై కొత్త రూమర్..?

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారడం జరిగింది. కొణిదల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ పెట్టడం జరిగింది. దీంతో రాజకీయాల నుండి సినిమాల్లోకి చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఖైదీ నెంబర్ 150 సినిమా చేయడం జరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది. దీంతో నిర్మాతగా మొట్ట మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన రాంచరణ్ తర్వాత సినిమా కూడా చిరంజీవితోనే నిర్మించడం జరిగింది. చిరంజీవి కెరియర్ లోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా సైరా ని తెరకెక్కించి ఇటీవల అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు రామ్ చరణ్. ఇటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న క్రమంలో..రామ్ చరణ్ పై మరియు పవన్ కళ్యాణ్ పై ఒక వార్త సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ తో రాంచరణ్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇందుకోసం డైరెక్టర్లకు కూడా ఆల్రెడీ రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అది ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఇక సినిమాలు చేయడం అనేది లేదని పవన్ కళ్యాణ్ తన పూర్తి జీవితాన్ని ప్రజల కోసం రాజకీయాల కోసం అంకితం చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు వస్తున్న వార్తలన్ని రూమర్లే అని కొట్టిపారేస్తున్నారు.