“గంగానది ప్రక్షాళన కోసం నా వంతుగా పోరాటం చేస్తా” : పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హరిద్వార్ లో ఉన్న సంగతి తెలిసిందే . ఈ ఉదయం హరిద్వార్ లో జరిగిన పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గంగానది ప్రక్షాళన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన జెడి అగర్వాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా అయన సమాధిని సందర్శించేందుకు పవన్ కళ్యాణ్ హరిద్వార్ వెళ్లారు. అక్కడ మాత్రి సదన్ లో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. గంగానది ప్రక్షాళన కోసం తన వంతుగా పోరాటం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

దక్షిణాది నుంచి తమకు మద్దతు లభించడం లేదని పవన్ దక్షిణాది నుంచి కూడా మద్దతు లభించేలా చూడాలని గంగాప్రక్షాళన కోసం కృషిచేస్తున్న సామాజిక వేత్తలు పవన్ ను కోరారు. పవన్ దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.