జమ్ము – కాశ్మీర్‌ జాతీయ రహదారి మూసివేత

వాస్తవం ప్రతినిధి: జమ్ము – కాశ్మీర్‌ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. రాష్ట్రంలోని రంబన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే 270 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. కొండ చరియలను తొలగించి రోడ్డును పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు.