స్వయంగా స్వచ్ఛభారత్ చేపట్టి మరోసారి స్ఫూర్తిగా నిలిచిన ప్రధాని

వాస్తవం ప్రతినిధి: స్వచ్ఛభారత్ పిలుపునివ్వడమే కాదు.. స్వయంగా స్వచ్ఛభారత్ చేపట్టి మరోసారి స్ఫూర్తిగా నిలిచారు మోడీ..ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి మహాబలిపురంలో పర్యటించారు. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ అలా తమిళనాడులోని మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లారు. అక్కడ బీచ్ లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు. స్వయంగా బీరు మద్యం బాటిళ్లను తీసి సంచిలో వేసుకొని భుజానా వేసుకోవడం విశేషం. దాదాపు అరగంట పాటు మోడీ బీచ్ లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. బీచ్ ను శుభ్రం చేశారు. తాను పొద్దున్నే స్వచ్ఛభారత్ చేసిన వీడియోను ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుదామని.. మనమంతా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత ముఖ్యమంటూ పేర్కొన్నారు.