పవన్ గెలిచి ఉంటే వేరేలా ఉండేది అంటున్న చంద్రబాబు..!

వాస్తవం ప్రతినిధి: 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి క్రియాశీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్…తర్వాత 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి పాలు కావడం జరిగింది. 2014 ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి పోటీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని దూరం పెట్టి వామ పార్టీలతో చేతులు కలిపి పోటీచేసి కేవలం ఒకే ఒక స్థానం గెలుచుకోవడం జరిగింది. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓటమి పాలవడం రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు…పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఏపీ రాజకీయాల వినబడుతున్న టాక్. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే పరిస్తితి మరో మాదిరిగా ఉండేదని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని సమాచారం. గాజువాక నియోజకవర్గ సమీక్ష సందర్భంగా ఒక కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించకపోవడం వల్ల టిడిపికి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బదులిస్తూ ఒక పార్టీ అధ్యక్షుడు పట్ల హుందాతనం ప్రదర్శించాలనే ఉద్దేశంతోనే తాను పర్యటించలేదని చెప్పారట. ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీపై ఉంటుందనే ఆలోచన చేశామే తప్ప ఎవరితోనూ మనకు లాలూచీ లేదని చెప్పారు. ‘ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే బహిరంగంగా పొత్తు పెట్టుకునేవాళ్లం. గాజువాకలో నేను పర్యటించకపోవడం వల్ల టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కొంత ఇబ్బం ది ఎదురైంది. నేను పర్యటించి ఉంటే కొన్ని ఓట్లు పెరిగి ఉండేవి. గాజువాకలో మన అభ్యర్థి శ్రీనివాసరావు బాగా పనిచేశారు. పవన్‌ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని చంద్రబాబు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.