అవినీతి కాంగ్రెస్‌ పార్టీ డిఎన్‌గా మారిపోయింది: యోగి ఆదిత్యనాథ్‌

వాస్తవం ప్రతినిధి: అవినీతి కాంగ్రెస్‌ పార్టీ డిఎన్‌గా మారిపోయిందని , కాంగ్రెస్‌ పార్టీ నేతలు ముందుగా దేశాన్ని అమ్మేశారని, ఓటర్లు వారిని నిలువరించడంతో ప్రస్తుతం తమ స్వంత పార్టీ నేతలకే టికెట్లు అమ్ముకుంటున్నారని ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. హర్యానాలోని కల్క, పంచకుల నియోజక వర్గాల్లో ఎన్నికల ర్యాలీలనుద్దేశించి యోగి ఆదిత్యనాథ్‌ ప్రసంగించారు. ”కాంగ్రెస్‌ అల్లుడు” గుర్గావ్‌నుంచి పంచకుల వరకూ ఏ భూమినీ విడిచిపెట్టలేదని ఆయన అన్నారు.