తన కుమార్తెల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ ఓపెనర్‌, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ తన కుమార్తెల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే “అష్టమి కంజక్‌” ఆచారంలో భాగంగా గంభీర్ ఈ పని చేశాడు. ఈ ఆచారం ప్రకారం తండ్రి తన కుమార్తెల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో గంభీర్‌ ఆ ఆచారాన్ని పాటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్‌ను తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నడు. తాను చేసిన ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా కామెంట్ పోస్టు చేశాడు.