డీటెయిల్ గా సైరా సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్..!

వాస్తవం సినిమా: స్వాతంత్ర పోరాట యోధుడు, దేశం కోసం తెలుగు ప్రాంతానికి చెందిన మొట్టమొదటి యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తారీకున విడుదల అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత చిరంజీవికి అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ సైరా రూపంలో పడిందని ఇండస్ట్రీలో ఉన్న వారు మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దసరా నేపద్యంలో విడుదలైన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. ఏడో రోజు ఈ సినిమా రూ.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రెండుతెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా రూ.83 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.

ఏరియాల వారీగా మొదటి వారం కలెక్షన్స్..

నైజాం………………………………….రూ.23.95 కోట్లు

సీడెడ్…………………………………..రూ.15 కోట్లు

ఉత్తరాంధ్ర…………………………..రూ.12.30 కోట్లు

గుంటూరు……………………………..రూ.8.45 కోట్లు

ఈస్ట్………………………………………..రూ.7.45 కోట్లు

వెస్ట్………………………………………….రూ.5.75 కోట్లు

కృష్ణ………………………………………….రూ.6.43 కోట్లు

నెల్లూరు……………………………………రూ.3.90 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఈ సినిమా రూ.83 కోట్లను సాధించింది. కర్నాటకలో రూ.13.30 కోట్లు, కేరళ, నార్త్ ఇండియా, తమిళనాడులో కలుపుకొని రూ.7.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.11.80 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటివారానికి గాను రూ.115.53 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ లెక్కల్ని బట్టి చూస్తే చిరంజీవి కెరియర్ లోనే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా సైరా చిరంజీవి కెరీర్లో నిలిచిపోయింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులో ఈ సినిమా సృష్టిస్తుందో చూడాలి.