బిగ్ బాస్ సీజన్ 3 లో అదే పెద్ద మైనస్..!

వాస్తవం సినిమా: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ రియాల్టీ షో లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు చూస్తున్న ప్రేక్షకులకు షో పై ఆసక్తిని పెంచుతున్నాయి. గత రెండు సీజన్ల కంటే ప్రస్తుతం సీజన్ చాలా అద్భుతంగా ఉంది కానీ ఒకే ఒక మైనస్ షో నీ వెంటాడుతోంది అని చాలామంది అంటున్నారు. అదేమిటంటే..వారమంతా ఇంటిలోని సభ్యులు ఆడతారు..అయితే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కూడా అద్భుతంగా జరుగుతుంది…అంతా ఆరు రోజులు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను ఊరించి ఒకేసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని విషయంలో చూస్తున్న వీక్షకులకు టెన్షన్ ఏమీ లేకుండా ముందే హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది లీక్ అవ్వడం ప్రస్తుత సీజన్ 3 కి అతి పెద్ద మైనస్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ముందే రావడంతో…షో పై..వీకెండ్ లో ప్రత్యేక ఆసక్తి ఉండటం లేదని సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో షో చివరి దశకు చేరుకున్న ఈ క్రమంలో…షో నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.