ప్రధాని మోడీతో భేటీ కానున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌

వాస్తవం ప్రతినిధి: చైనా సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి న్యూఢిల్లి ”నిజాయితీ, స్నేహపూర్వక” వాణిజ్య వాతావరణాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నామని చైనా పేర్కొంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన సందర్భంగా ఆ దేశం ఈ వ్యాఖ్యలు చేసింది. చైనా టెలికాం సంస్థ హ్యువీ తమ 5జి మొబైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించకుండా చూడాలని వివిధ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో భారత్‌లో చైనా రాయబారి సూన్‌ వీడాంగ్‌ పై వ్యాఖ్యలు చేశారు. చైనా, భారత్‌ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అనేక అవకాశాలున్నాయని సూన్‌ అన్నారు. జిన్‌పింగ్‌ శుక్రవారంనాడు తమిళనాడులోని చెన్నై చేరుకోనున్నారు. మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమవుతారు.