తెలంగాణ లో ఐదో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.