పండగ రోజు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్..? 

వాస్తవం ప్రతినిధి:  దసరా సందర్భంగా ముఖ్యమంత్రిని కలుద్దామని వెళ్లిన తెలంగాణ క్యాబినెట్ మంత్రుల కు దిమ్మతిరిగి పోయే విధంగా కేసీఆర్ వార్నింగ్  ఇచ్చినట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై ముందు నుండి ఎవరు కూడా నోరు మెదపకుండా మౌనంగా ఉండటం పై మంత్రులపై తీవ్రంగా కెసిఆర్ ఆగ్రహం చెందినట్లు సమాచారం. ప్రభుత్వం పై ఆర్టీసీ కార్మికులు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టకుండా ఏం చేస్తున్నారని అసలు మీరు మంత్రులే నా అని కెసిఆర్ ప్రశ్నించాడట. మరోపక్క విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్న తరుణంలో ఏమీ మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని తీవ్ర ఆగ్రహంతో క్యాబినెట్ మంత్రులపై కేసీఆర్ విరుచుకుపడ్డారట. దీంతో..ఇటీవల తాజాగా పండుగ నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు  పండుగ విషయాన్ని పక్కన పెట్టి.. కార్మిక సంఘాల సమ్మెను తప్పు పట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నిరంజన్ రెడ్డిలు ప్రభుత్వ వాదనను వినిపిస్తూనే.. కార్మిక సంఘాల్ని హెచ్చరించారు. కార్మిక నేతల ఉచ్చులో పడొద్దంటూ సూచనలు చేస్తున్నారు. ఇలా ఆగ మేఘంగా మంత్రులు సమ్మె విషయంలో మీడియా ముందుకు రావటం వెనుక కెసిఆర్ ప్రభావమే అని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద రెండవ రోజు కెసిఆర్…తన క్యాబినెట్ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.