దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి అంటున్న టీ ఎస్ ఆర్టీసీ జేఏసీ..!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఆర్టీసీ సమ్మె చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా దసరా సెలవులు క్రమంలో..ఆర్టీసీ కార్మికులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు కేసిఆర్ చేస్తున్న కామెంట్లను బట్టి అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్ల విషయంలో కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆయా రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరు అయ్యాయి. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగాఆర్టికి సార్మిక సంగాల జెఎసి చైర్మన్ అశ్వద్దరెడ్డి మాట్లాడుతూ ప్రజల తమను అర్దం చేసుకోవాలని అన్నారు. తాము ఆర్టిసిని రక్షించడానికే సమ్మె కు దిగామని ఆయన అన్నారు. ఆర్టిసిని ముంచడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.ప్రజలకు జరుగుతున్న అసౌకర్యానికి తాము కూడా బాద పడుతున్నామని అన్నారు. ఆరేళ్లలో కొత్తగా ఎవరిని నియమించలేదని, ఇప్పుడు ప్రైవేటు వారికి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు తమకు దశ,దిశ చూపాలని ఆయన అన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు కూడా పిలుపు ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం, టిడిపి నేత రావుల చంద్రశేఖరరడె్డి, టిజెఎస్ నేత కోదండరామ్ తదితరులు హాజరయ్యారు.