దసరా సందర్భంగా రాఫెల్ కు ఆయుధ పూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్

వాస్తవం ప్రతినిధి: విజయదశమి సందర్బంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 36 రాఫెల్ విమానాలలో మొదటిదాన్ని అధికారికంగా తీసుకున్నారు . ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2021 నాటికి 18 రాఫెల్ విమానాల డెలివరీ చేసే అవకాశం ఉందని , 2022 ఏప్రిల్-మే నాటికి మొత్తం 36 విమానాలను పొందుతామని ఆయన చెప్పారు. మొదటి నాలుగు విమానాలను 2020 మే నాటికి భారతదేశానికి డెలివరీ చేయపడుతుందని ఆయన అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ విమానం అప్పగించిన తరువాత దసరా సందర్భంగా ఆయుధ పూజ చేశారు.అంతే కాకుండా దాని చక్రాల క్రింద రెండు నిమ్మకాయలను ఉంచి అదే విమానంలో ప్రయాణం చేసారు .