ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలను ఆదుకున్న రజినీకాంత్..!

వాస్తవం సినిమా: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్లో అయితే రజినీకాంత్ ని అక్కడ ఉన్న అభిమానులు ఏకంగా దేవుడిగా భావిస్తారు . ముఖ్యంగా రజినీకాంత్ మాటకి చాలా వ్యాల్యూ ఉంటుంది. ఏదైనా మాట ఇస్తే వెనక్కి తీసుకోరని చాలామంది రజినీకాంత్ స్నేహితులు మరియు సన్నిహితులు అంటుంటారు. ముఖ్యంగా ఆయన చేసే సహాయాలు మరియు సమాజానికి చేసే మేలు అందరిని ఆశ్చర్యానికి ఆలోచనలో పడేస్తాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిర్మాత ఒకరు అద్దె ఇంటిలో ఉంటున్నారు అని తెలుసుకున్న రజినీకాంత్ సదరు నిర్మాత కి ఇల్లు ఇస్తానని మాట ఇచ్చారట. అంతేకాకుండా సదరు నిర్మాత రజినీకాంత్ కెరియర్ ని టర్న్ చేసిన వాడని సమాచారం. ఆ నిర్మాత గురించి ఇటీవల సన్మాన సభలో రజనీకాంత్ మాట్లాడుతూ…నా మొదటి సినిమా నిర్మాత కలైజ్ఞానం లేకుంటే నేను కథానాయకుడిగా నిలదొక్కుకునేవాడిని కాదని విలన్ గా ఉన్న నన్ను హీరోగా చూపించి మంచి జీవితాన్ని ఇచ్చారని ఆ సభలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు గడవకముందే గృహ ప్రవేశం చేయించారు. గత నెలలో సీనియర్ కథారచయిత, నిర్మాత కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఈ సభకు సూపర్ స్టార్ రజినీకాంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యి సభలో ఇచ్చిన మాటను నెల రోజులు గడవక ముందే నిలబెట్టుకోవడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది అభిమానుల్లో మరోసారి రజినీకాంత్ దేవుడు అయ్యారు.