కొరటాలతో చిరంజీవి చేయబోయే సినిమా లేటెస్ట్ న్యూస్..!

వాస్తవం సినిమా: ‘సైరా’ సినిమా తో ‘ఇంద్ర’ తరహాలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి రి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ షేక్ అయ్యే హిట్ ‘సైరా’ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు మెగా అభిమానులు ‘సైరా’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం పై కామెంట్ చేస్తున్నారు. దసరా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సైరా ధియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు..క్రియేట్ చేస్తూ నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ సంబరాలలో ఎంజాయ్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా సైరా సినిమా హిట్ అయ్యి రోజులు గడవక ముందే తన తర్వాత సినిమా కోసం చిరంజీవి అప్పుడే రెడీ అయిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మనకందరికీ తెలుసు సైరా తర్వాత కొరటాలతో చిరంజీవి..సినిమా చేస్తున్నారని. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే దసరా పండుగ నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టి..అతి తక్కువ రోజుల్లో రెగ్యులర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి చిరంజీవి ఫుల్ గా డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. అంతే కాకుండా ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చిరంజీవి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.