ఒకపక్క కెసిఆర్ కి మేలు చేస్తూ మరో పక్క గుంట తవ్వుతున్న పార్టీ…?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ చేస్తున్న సమ్మె ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. టీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆపే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పి దసరా సెలవుల నేపథ్యంలో సరిగ్గా టైం చూసుకుని కేసీఆర్ సర్కార్ కి షాక్ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టీఎస్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏమాత్రం బెదిరి పోకుండా…ఎలాగైనా టి ఎస్ ఆర్ టి సి బస్సులను నడిపిస్తామని..సమ్మె చేస్తున్న కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి రావాలని రాకపోతే ఉద్యోగాలు ఉండవు అన్నట్టుగా కెసిఆర్ వ్యవహరించటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలో ఒకటి అయిన సీపీఐ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఒకపక్క కేసీఆర్కి మేలు చేస్తూనే మరోపక్క గుంట తవ్వుతున్నట్లు ఉందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళితే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న సిపిఐ…ఇప్పుడు ఇబ్బందిలో పడినట్లుగా ఉంది. ఆ పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ ఎఐటియుసి సమ్మెలో పాల్గొంటోంది. ఆ కార్మిక నేతలు టిఆర్ఎస్ కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.కాని అందుకు సిపిఐ సిద్దపడలేదు. మరో వైపు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టిసి సమ్మెను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆర్టిసి ప్రైవేటీకరిస్తారన్న భయం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటారా అని అడిగితే అది రాజకీయ నిర్ణయం అని మాత్రమే జవాబు ఇచ్చారు. మొత్తం మీద ఈ పరిణామంతో ఒకపక్క కేసీఆర్కు మేలు చేస్తూనే మరోపక్క..సిపిఐ పార్టీ గుంట తవ్వుతున్నట్లు ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.