వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

వాస్తవం ప్రతినిధి: వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన కృషికి నోబెల్‌ పురస్కారం లభించింది. ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి పురస్కారం అందుకోనున్నారు. విలియ్‌ కీలిన్‌ జూనియర్‌, సర్‌ పీటర్‌ రట్‌క్లిఫ్‌, గ్రెగ్‌ సెమెంజాలు ముగ్గురు నోబెల్‌ బహుమతిని పంచుకోనున్నారు. కణాలు తమకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను గుర్తించి, తనకవసరమైన విధంగా ఉపయోగించుకోవడంపై వారు చేసిన పరిశోధనలకుగాను వారికి నోబెల్‌ పురస్కారం లభించింది.