అమెరికాలో తెలుగు అమ్మాయి ఆత్మహత్య..!

వాస్తవం ప్రతినిధి: బాగా చదువుకుని స్వదేశం నుండి విదేశాలకు వెళ్లి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు గాని ఉన్న జీవితాన్ని కన్న తల్లిదండ్రులతో గడపలేక కేవలం డబ్బు సంపాదించడానికే పుట్టామా అన్నట్టుగా బతుకుతున్నారు పోన్లే సంపాదించిన డబ్బుని అనుభవిస్తున్నారా అంటే అది కూడా లేదు…కేవలం డబ్బు సంపాదించడానికి పుట్టామా అన్నట్టుగా ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. ఒకపక్క ఒత్తిడిని తట్టుకోలేక యువ ప్రపంచం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోపక్క బాగా చదువుకొని అతి చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సంపాదించి విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకొని కలిసిమెలిసి సంతోషంగా ఉండాల్సిన జంటలు అనవసర గొడవలకు, ఈగోల కు పంతం పట్టి తమకి తామే శిక్ష విధించకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని నార్త్ కరోలినా లో ఒక తెలుగు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించిందన్న సమాచారం వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. హైదరాబాద్ నాగోల్ కు చెందిన గజం వనిత అనే ముప్పై ఎనిమిదేళ్ల మహిళ అత్తింటివారి గొడవల కారణంగా కొంతకాలం తల్లిదండ్రుల వద్దే ఉందట. రెండు నెలల క్రితం ఆమె భర్త వద్దకు అమెరికా వెళ్లింది. ఆ తర్వాత 2 నెలలనుంచి తల్లిదండ్రులతో కాంటాక్ట్‌లోకి రాలేదు.కాని ఆదివారం వనిత తల్లిదండ్రులకు ఆమె సూసైడ్‌ చేసుకున్నట్లు సమాచారం అందింది.అమెరికాలో ఆమె భర్త రాచకొండ శివకుమార్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వనిత బౌతిక కాయాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు సహకరించాలని ఆమె తల్లిదంద్రులు కోరుతున్నారు.