గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కూప్ప కూలిపోకుండా సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం..!

వాస్తవం ప్రతినిధి: రాజకీయాలలో తన తండ్రి చనిపోయిన నాటినుండి జగన్ వ్యవహారశైలి ఒకసారి గమనిస్తే ప్రజలు అన్నట్టుగానే నిర్ణయాలు తీసుకుని రాజకీయ అడుగులు వేయడం జరిగింది. దీంతో 2014 ఎన్నికలలో అందరూ జగన్ గెలుస్తారు అని భావించినా గాని ఓడిపోవడం జరిగింది . ఆ సమయంలో చంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలిచి మొట్టమొదటిసారి జగన్ కి ఊహించని విధంగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది.

అయితే ఆ తర్వాత జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత అసెంబ్లీ లో రాష్ట్ర సమస్యలపై అనేకసార్లు జగన్ గళం విప్పిన పెద్దగా తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ చేస్తున్న ఆరోపణలకు విలువ ఇవ్వకపోవడంతో..వెంటనే అసెంబ్లీని బాయ్ కట్ చేసి జగన్ పాదయాత్ర మొదలుపెట్టి వన్ మాన్ ఆర్మీ గా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓడించటం జరిగింది.

మొత్తం మీద 2019 ఏపీ ఎన్నికలు గమనిస్తే అన్ని చోట్ల వైయస్ జగన్ మొహం చూసి ప్రజలు ఓట్లు వేసినట్లు తేలింది. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్ తనకి ప్రజలకు మాత్రమే కనెక్షన్ ఉండేలా అనేక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలోనే ఉన్న సీనియర్ రాజకీయ నేతలకు మతిపోయేలా ఏపీ లో పరిపాలించడం ప్రస్తుతం జరుగుతోంది. దీనిలో భాగంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన జగన్ ఈ వ్యవస్థతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒకేసారి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.

వారికి 5వేల రూపాయల వేతనం అంటూ జగన్ నిర్ణయించడం జరిగింది. దీంతో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇతర విపక్ష పార్టీలు గ్రామ వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఏం చేద్దామని వారి జీవితాలతో ఆడుకుందామననేనా …అయిదు వేల రూపాయలు దేనికి సరిపోతాయి అంటూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై అపహాస్యం, హేళన చేస్తూ విమర్శలు చేయడం జరిగింది. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా అనేక విమర్శలు రావడంతో..చాలామంది వీధుల్లోకి వచ్చిన గ్రామ వాలంటీర్లు..తాము చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టడం జరిగింది.

దీంతో తాను తీసుకు వచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కూలిపోకుండా జగన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే ఇప్పటి వరకు జగన్ కేవలం 5వేలు మాత్రమే జీతాలను ఇస్తుండగా ఇప్పుడు దాన్ని మరో 3 వేలు పెంచి మొత్తం 8000 వేలు జీతాన్ని ఇవ్వబోతున్నట్టుగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అంతే కాకుండా దీనికి సంబంధించిన జీవో ను కూడా మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నారని తెలుస్తుంది. మొత్తం మీద గ్రామ వాలంటీర్ల వ్యవస్థ నీరుగారి పోకుండా జగన్ గట్టిగానే పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.