సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

వాస్తవం ప్రతినిధి: తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం విస్మరించలేనిదని, ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరాడారని రేవంత్ వెల్లడించారు.