బాలీవుడ్ ఇండస్ట్రీలో కి రీమేక్ అవుతున్న ఇస్మార్ట్ శంకర్..? హీరో ఎవరో తెలిస్తే షాక్ అవడం ఖాయం!!

వాస్తవం సినిమా : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అవుతున్న కథలు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపే కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. అర్జున్ రెడ్డి, బాహుబలి వంటి తెలుగు కథలు బాలీవుడ్ లోకి రీమేక్ అయ్యి ఇటీవల అద్భుతాలు సృష్టించిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖ నిర్మాతలు డైరెక్టర్లు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న కథలపై ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. కాగా ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ అదిరిపోయే మాస్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసినదే. దాదాపు డైరెక్టర్ పూరి మరియు హీరో రామ్ కెరియర్ లో ఈ సినిమా రాకముందు వరకూ పూర్తి అంధకారంలో ఉండటం జరిగాయి. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి హిట్ అందుకోవడం జరిగిందో మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ బూస్ట్ అయ్యారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాపై దృష్టి సారించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న టాక్. అంతేకాకుండా త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టి సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరియు అదే విధంగా ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. అయితే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో రానుందని సమాచారం.