పోలీసు వ్యవస్థకు పారదర్శకతలతో కూడిన స్వయంప్రతిపత్తి ఉండాలి: వెంకయ్యనాయుడు

వాస్తవం ప్రతినిధి: పోలీసు వ్యవస్థకు జవాబుదారీతనం, పారదర్శకతలతో కూడిన స్వయంప్రతిపత్తి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి మారితే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి) కూడా మారాలా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా డిజిపిలు మారుతుంటారని, ఎందుకిలా జరగాలని ఆయన అన్నారు. పోలీస్‌ సంస్కరణ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. డిజిపిలకు కచ్చితమైన పదవీకాలం ఉండాలని ఆయన అన్నారు. బైటినుంచి ఒత్తిళ్లు లేకుండా పోలీస్‌ వ్యవస్థను పటిష్టపరచాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నిర్దేశించిందని ఆయన చెప్పారు.