అందుకేనా జగన్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ కి సీబీఐ బాధ ఇప్పుడప్పుడే తప్పేటట్లు లేదు అన్నట్టుగా పరిస్థితులు తలపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు..తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేశాడని, దానివల్ల ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, అలాగే మొదటినుండి జగన్ రాజకీయంగా ఎదుగుతున్నప్పటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ హవా వ్యాపిస్తున్న క్రమంలో…ఏపీలో కూడా బిజెపి పార్టీ అధికారంలోకి కొద్దో గొప్పో అవకాశాలు ఉంటాయేమో అని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జగన్ పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొద్దో గొప్పో కొద్దిగా సీబీఐ కేసుల్లో చూసి చూడనట్లు వదిలేసినా ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉన్నాగానీ సీబీఐ కేసుల్లో గతంలో కంటే ఇప్పుడు చాల కఠినంగా కేంద్రం వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న టాక్. విషయంలోకి వెళితే ఇటీవల ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాలంటే చాలా సమయం వృధా అవుతుందని అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని శుక్రవారం సీబీఐ కోర్టు కి హాజరు ఏ విషయంలో మినహాయింపు ఇవ్వాలని జగన్ ఇటీవల సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలో సీబీఐ …జగన్ జైల్లో మరియు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే సాక్షులను ప్రభావితం చేశారని…మరి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఇంకా ఎంతో ప్రభావితం చేసే అవకాశం ఉందని కచ్చితంగా జగన్ సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరుకావాలని తెలియజేయడం జరిగింది. దీంతో ఈ విషయం గురించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. కావాలనే కేంద్రప్రభుత్వం జగన్ చుట్టూ ఏపీలో బీజేపీ పార్టీ ఎదగడానికి ఉచ్చు బిగ్గిస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.