కూలిన శిక్షణ విమానం..ఇద్దరు పైలెట్లు మృతి

వాస్తవం ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో శిక్షణ విమానం కూలింది. సుల్తాన్‌పూర్‌ వద్ద పంట పొలాల్లో విమానం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణ పైలట్లు ప్రకాశ్‌ విశాల్‌, అమన్ ప్రీత్ కౌర్ లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతింది. విమానం బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.