పోలీసులు గాలింపులు..పరారీలో ఉన్న బండ్ల గణేష్..!

వాస్తవం సినిమా: టాలీవుడ్ కమెడియన్ నిర్మాత బండ్ల గణేష్ పై మరియు అతని అనుచరులపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్_( పీవీపీ )జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. విషయంలోకి వెళితే అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా విషయంలో బండ్ల గణేష్ కి 30 కోట్లు పొట్లూరి వరప్రసాద్ పెట్టుబడి రూపంలో ఇవ్వడం జరిగిందట. దీంతో సినిమా విడుదల అయిన సందర్భంలో బండ్ల గణేష్ పీవీపీకి…అసలు మొత్తాన్ని చెల్లించి, మిగిలిన దానికి బండ్ల గణేష్ చెక్కులు అందించారు. మిగిలిన డబ్బులు చెల్లించాలంటూ బండ్ల గణేష్ ను పీవీపీ కోరారు. దీంతో గణేష్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి అతనిపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. దీంతో వెంటనే పీవీపీ బండ్ల గణేష్ పై మరియు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. గతంలో కూడా అనేక విషయాలలో బండ్ల గణేష్ పై ఇటువంటి కేసులు నమోదు కావడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి రాజకీయాల్లో కూడా వెళ్లి తాజాగా తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా బండ్ల గణేష్ కమెడియన్ పాత్ర లో నటిస్తున్నారు కూడా. ఇటువంటి నేపథ్యంలో బండ్ల గణేష్ పై పోలీస్ కేసు నమోదు కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది.