టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్!

వాస్తవం ప్రతినిధి: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయనతో పాటు మాజీ సీఎఫ్ఓ మూర్తిను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిధులను దుర్వినియోగం చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అనుమతి లేకుండానే చెక్కులతో డబ్బులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కోట్లాది రూపాయలను రవిప్రకాశ్ దుర్వినియోగం చేశారని తెలిపింది. రూ. 18 కోట్లకు పైగా కుంభకోణం చోటు చేసుకుందని తెలిపారు. వీరిపై సెక్షన్ 409, 418, 420, 509ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పీఎస్ లో విచారణ జరుపుతున్నారు.