సైరా’ – ‘రివ్యూ’:

టైటిల్: సైరా నరసింహా రెడ్డి
యాక్టర్స్: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, అనుష్క, సుదీప్, విజయ్ సేతుపతి రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు
డైరెక్టర్: సురేందర్ రెడ్డి
బేనర్: కొణిదెల ప్రొడక్షన్
మ్యూజిక్: అమిత్ త్రివేది, జూలియస్ ఫాఖియం
ప్రొడ్యూసర్: రాంచరణ్
సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు
డైలాగ్స్: బుర్ర సాయిమాధవ్
కథ : పరుచూరి బ్రదర్స్
విడుదల తేదీ: 02.10.1209

రేటింగ్: 4/5 

 వాస్తవం సినిమా: తెలుగు తెర కి ఏకైక మెగా స్టార్ అయినటువంటి చిరంజీవి కొత్త సినిమా సైరా తన ట్రెయిలర్ నుంచే అందరినీ ఆకట్టుకున్నట్టు కనిపించింది. తారాగణం విషయం లో ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తీసుకున్న ప్రత్యేకత కారణంగా ఇండియా లెవెల్ లో సైరా వైబ్రేషన్స్ చాలా స్పష్టంగా కనిపించాయి. మొట్టమొదటి సాంగ్ విడుదల తరవాత సినిమా మీద హైప్ విపరీతంగా పెరిగిపోయింది . కెరీర్ లో అనేక గొప్ప సినిమాలు , ఎత్తులు పల్లాలు చూసిన మెగా స్టార్ కి ఇది 151 వ చిత్రం కావడం విశేషం. ఇంత హైప్ సృస్టించిన సైరా ఏ మేరకు ప్రేక్షకులని అలరించిందో చూద్దాం రండి.

కథ – విశ్లేషణ :

18 వ దశకం లో తెల్లదొరల బానిసత్వానికి ఎదురు తిరిగిన ఏకైక పోరాట యోధుడు సైరా నరసింహా రెడ్డి కథ ని సురేందర్ రెడ్డి ఎంచుకోవడమే అతిపెద్ద సాహసం అని చెప్పాలి. తెలుగు ప్రాంత నాయకుడు కావడం , మెగా స్టార్ ఆ పాత్రకి చక్కగా సరిపోవడం తో మొదటి నుంచీ ఈ పాత్ర ఆసక్తికరంగానే సాగుతుంది. బానిసత్వం లో దేశం , రాష్ట్రం , ప్రాంతం మునిగిపోయి ఉన్న పరిస్తితి లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూల్చడం కోసం సరికొత్త వీరుడు గా సైరా అవతరిస్తాడు. ప్రజలని ఎలా స్వాతంత్ర్య కాంక్ష కోసం నడిపించాడు , ప్రజలలో ఎలా మమేకం అయ్యాడు , స్వేచ్చ యొక్క గొప్పతనాన్ని ఎంతగా చాటి చెప్పాడు .. అందరినీ ఒక్కతాటి మీదకి ఎలా తీసుకుని రాగలిగాడు అనే కథాంశం తో సైరా సినిమా ఆసాంతం నడుస్తుంది.. సైరా ని ప్రాణంగా ఇష్టపడే పాత్ర లో తమన్నా కనిపిస్తుంది , అతనికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధ పడుతుంది అతని భార్య నయనతార .. విభిన్న ప్రాంతాల నుంచి ఉయ్యలవాడ యోధుడి పోరాటానికి స్పూర్తి నింపడం కోసం వచ్చిన వీరులు గా సుదీప్ , విజయ్ సేతుపతి తమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. అమితాబ్ బచ్చన్ కారెక్టర్ కాస్తంత తక్కువ నిడివి ఐనా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఈ సినిమా ని తన భుజ స్కందాల పైన మోశారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియూ హీరో చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఒదిగిపోయిన చిరంజీవి – ఆహార్యం , నైపుణ్యం , నైజాం అన్నింటా గ్రాండ్ లుక్ ని చక్కగా చూపించాడు. స్క్రీన్ ప్లే విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకున్న సురేందర్ రెడ్డి .. అసాధారణ ఔట్ పుట్ చూపించాడు .. పోరాట సన్నివేశాలు , యుద్ధ సన్నివేశాలు సినిమా కి హైలైట్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సన్నివేశాలు కుర్చీ లో ఉన్న ప్రేక్షకులని అరచి గోల చేసే విధంగా సినిమా చిత్రీకరించారు. మరియు అదే విధంగా క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. కాగా టెక్నికల్ టీం వర్క్ తో పాటు అమిత్ త్రివేది నేపధ్య సంగీతం కూడా అద్దిరిపోయేలా సింక్ అయ్యింది ..

నెగెటివ్ లు : 

VFX విషయం లో కాస్తంత నిరాశ తప్పదు అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లు మినిమమ్ కూడా లేకపోవడం .. సినిమా ఆసాంతం సీరియస్ గా వెళ్ళడం కూడా ఇబ్బందికర అంశాలు. సెంటిమెంటల్ సీన్స్ లో సెంటిమెంట్ కాస్త ఓవర్ అయ్యింది అనే చెప్పచ్చు . రన్ టైం సైతం కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే నేటి యువతకి ఈ సినిమా ఇంకా బాగా ఎక్కుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సినిమా రిచ్ లుక్ విషయం లో ప్రొడ్యూసర్ రామ్ చరణ్ అక్కడక్కడా వెనక్కితగ్గినట్టు కనిపించినా సినీ ఫొటోగ్రఫి లో అది కవర్ అయిపోయినట్టు అనిపిస్తుంది.

ఓవర్ ఆల్ గా చూసుకుంటే .. చిరంజీవి లాంటి లెజెండరీ హీరో కి ఈ సినిమా మరొక పెద్ద మణి మకుటం అనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 వ చిత్రం తో తన సత్తా ఏంటో చాటుకున్నా మెగాస్టార్ .. పాన్ ఇండియా లెవెల్ లో డీసెంట్ సినిమా ని అందించాడు. చిరంజీవి నటన , సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే , నేపధ్య సంగీతం , బరువైన పాత్రలు , సినిమాటోగ్రాఫి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ సినిమా సదరు ప్రేక్షకుడిని తేలికగా నచ్చుతుంది. దేశభక్తి ని కూడా సమపాళ్లలో కలిపి వడ్డించారు కాబట్టి సైరా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నంబర్స్ దక్కించుకోబోతోంది అని చెప్పాలి ..