ఉద్దేశపూర్వకంగా అమెరికాలో సిక్కు పోలీస్ అధికారిని చంపిన దుండగులు..!

వాస్తవం ప్రతినిధి: అమెరికా దేశంలో కాల్పులు ఏమాత్రం ఆగటం లేదు. తాజాగా ఇటీవల అమెరికా దేశంలో గత కొన్ని సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తూ హిస్టరీ మేకింగ్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ సింగ్ అనే 40 ఏళ్ల పోలీస్ అధికారిని విచక్షణరహితంగా రోడ్డుపై కాల్చి చంపడం జరిగింది. సిక్కు మతానికి చెందిన సందీప్ ని అమెరికాలో జరిగే విపత్తుల సమయంలో రోడ్డుపై గడ్డం పెంచుకుని తలపాగా చుట్టుకుని చాలా ధైర్యంగా డ్యూటీ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. కాగా శుక్రవారం సాయంత్రం విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో కారులో ఉన్న ఒక జంట కావాలని విచక్షణ రహితంగా సందీప్ సింగ్ పై కాల్పులు జరిపి పరారావడం జరిగింది. దీంతో ఈ కాల్పుల్లో సందీప్ సింగ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.. గత పదేళ్లుగా హారీస్‌ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ పోలీస్‌ ఆఫీసర్‌ సందీప్ సింగ్ ధాలివాల్(40) తన సేవలందిస్తున్నారు. శుక్రవారం అర్దరాత్రి స్థానికంగా ట్రాఫిక్‌ విధులను నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేస్తుండగా.. కారులోంచి ఓ దుండగుడు బయటకు వచ్చి సందీప్‌ సింగ్‌పై అతికిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు.తాజాగా జరుగుతున్న విచారణలో మాత్రం కావాలని సందీప్ ని టార్గెట్ చేసి చంపారు అన్న వార్తలు వినబడుతున్నాయి.