సాగర మథన ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు

వాస్తవం ప్రతినిధి: విక్రమ్‌ వైఫల్యాలపై ఒక వైపు అధ్యయనం చేస్తూనే, మరోవైపు ఇస్రో తాజాగా సాగర గర్భంలోకి శాస్త్రవేత్తలను పంపి, అక్కడ పరిశోధనలను చేయాలని భావిస్తోంది. అందుకోసం సాగర మదన ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. సముద్ర గర్భంలో మైనింగ్‌, ఇంధన వనరులు, ఇతరత్రా వనరులపై అధ్యయనంచేసి పూర్తిసమాచారాన్ని అందించేందుకు ఈ తరహా ప్రయోగాన్ని చేయాలని భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుండే ప్రత్యేక రాకెట్‌నుకూడా సిద్ధం చేస్తోంది. దానికి సముద్రయాన్‌ అనే నామకరణం కూడా చేసింది. సముద్ర గర్భంలో సుమారు 6 వేల కిలోమీటర్ల లోతు వరకు పరిశోధకులను పంపాలని, అందుకోసం రూ. 6 వేల కోట్లతో ఓషన్‌ మిషన్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి రూ. 200 కోట్లను ఖర్చు చేసింది.