రజినీకాంత్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ..?

వాస్తవం ప్రతినిధి: ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయ రంగంలో అడుగుపెట్టిన రజినీకాంత్ రాబోయే తమిళ ఎన్నికలలో సత్తా చాటడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి వెంటనే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్ళటానికి రజినీకాంత్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తమిళ రాజకీయాల్లో నిలబడుతున్న టాక్. ఈ క్రమంలో తనకు రాజకీయంగా సలహాలు ఇవ్వటానికి, తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తమిళ రాజకీయాల్లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త తమిళ మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రజనీకాంత్ పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి రెడీ అవ్వడానికి డిసైడ్ అయ్యాడట. ఇందు మూలంగానే ప్రశాంత్ కిషోర్ తో రజనీ కాంత్ భేటీ అయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
2014లో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదికి, రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహించారు. ఆ ఎన్నికలో భారతీయ జనతాపార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రాత్మక విజయం సాధించింది. రాజకీయ పార్టీ కోసమే ఆయన కిషోర్ సేవలను అడిగారా ?లేదా అన్నది ఇంకా తేలలేదు. అయితే ఇదే సమయంలో మరో ప్రముఖ నటుడు కమల్ హసన్ కు కూడా ప్రశాంత కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారట. మరి ఇద్దరికి ఎలా పనిచేస్తారో తెలియదు. లేక వారిద్దరిని కలుపుతారా అన్నది చూడాలి. దీనికి సంబందించిన వార్తలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం తమిళ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ తో రజనీకాంత్ బేటీ కావటం పెద్ద సంచలనంగా మారింది.