హరీష్ శంకర్ కి మద్దతుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి..!

వాస్తవం సినిమా: మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నీ హీరోగా పెట్టి డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘వాల్మీకి’ సినిమా టైటిల్ గురించి అనేక వివాదాలు తెలపడం జరిగింది. బోయ కులానికి చెందిన వాల్మీకిని కించపరిచారని వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలని హైకోర్టు దాకా బోయ కులానికి చెందిన పెద్దలు వెళ్లి మరి ఇటీవల వివాదం సృష్టించడం జరిగింది. దీంతో డైరెక్టర్ హరీష్ శంకర్ వాల్మీకి సినిమా టైటిల్ తీసివేసి ‘గద్దల కొండ గణేష్’ గా పెట్టడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో హరీష్ శంకర్ కి మద్దతుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్పందించారు. ”ఇది చాలా బాధాకరం. ఏ దర్శకుడు, సినిమా ఇలాంటి బాధలు పడటానికి అర్హులు కాదు. హరీశ్.. మేమంతా మీతో ఉన్నాం. సినిమా పట్ల మీకు ఎంతటి కమిట్‌మెంట్ ఉందో మా అందరికీ తెలుసు. ‘గద్దలకొండ గణేశ్’ తప్పకుండా విజయం సాధిస్తుంది” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.