హృతిక్ రోషన్, ప్రభాస్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా..?

వాస్తవం సినిమా: బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు సూపర్ హిట్ అయిపోయాడు ప్రభాస్. దీంతో ఇటీవల భారీ బడ్జెట్ తో వచ్చిన ‘సాహో’ సినిమా విడుదలయ్యి మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కించాలనుకునే దర్శకులకు ఓ ఆప్షన్ గా ప్రభాస్ మారిపోయాడు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో హృతిక్ రోషన్, సీతాదేవి పాత్రలో దీపికా పదుకొనె నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రామాయణంలో అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్ర కోసం ప్రభాస్ ని దర్శకుడు నితీష్ సంప్రదించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.