తూర్పుగోదావరి జిల్లా లో కమలహాసన్..!

వాస్తవం సినిమా: సౌత్ ఇండియా విలక్షణ నటుడు కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. గతంలో వీరిద్దరి కలయికలో 1996వ సంవత్సరంలో వచ్చిన భారతీయుడు అప్పట్లో దేశంలోనే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరూ ఇప్పటికి కూడా మర్చిపోలేరు. ఇటువంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో జరుపుకుంటోంది. జైల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సినిమా యూనిట్ చిత్రీకరించినట్లు సమాచారం. కాగా తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూల్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో జరపాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్‌, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ సంవ‌త్స‌రాది సందర్భంగా 2020 ఏప్రిల్ 14న ‘భారతీయుడు 2’ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ శంకర్ చేసిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ సీక్వెల్ ఫార్ములాతో అయినా హిట్ అందుకోవాలని గట్టిగా భారతీయుడు-2 సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్లు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో వినబడుతున్న టాక్.