మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అక్కినేని అన్నదమ్ములు..!

వాస్తవం సినిమా: అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అక్కినేని కుటుంబ వారసులుగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నయ్య నాగచైతన్య వరుస హిట్లతో సక్సెస్ కెరియర్ కొనసాగిస్తుండగా అఖిల్ కి ఇప్పటివరకు సూపర్ హిట్ పడలేదు. దీంతో నాగార్జున ఎలాగైనా అఖిల్ కి బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశారు. ఇటువంటి క్రమంలో అక్కినేని అఖిల్ మరియు నాగ చైతన్య కలిసి ఆర్ ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ పేరిట సినిమా వస్తున్న సంగతి గత కొంత కాలం నుండి ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయని ఈ టైటిల్ సినిమాలో అప్పట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మొదలుకొని రవితేజ వరకు ఇంకా చాలామంది పేర్లు బయటకు వచ్చాయి కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. ఇటువంటి క్రమంలో తాజాగా ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్టులో అక్కినేని అఖిల్ మరియు నాగ చైతన్య ఒప్పుకున్నారని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు రాలేదు.