నెక్స్ట్ చేయబోయే సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభాస్…?

వాస్తవం సినిమా: ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే రేంజ్ లో అభిమానులకు హిట్ అందివ్వాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ స్టోరీ అయిన సాహో సినిమా చేయడం జరిగింది. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ని చూసిన సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు మరియు ప్రభాస్ అభిమానులు చాలా చండాలంగా సాహో సినిమా లో ప్రభాస్ లుక్ ఉందని భయంకరంగా విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ లుక్స్, అలాగే మేకప్ పై ట్రోల్స్ వెలువడ్డాయి. ఈ విషయంపై ప్రభాస్ కొంత అసంతృప్తికి లోనైట్లు టాక్. అందుకే నెక్స్ట్ సినిమాకు సంబందించిన యూనిట్ తో ఇటీవల చర్చలు జరిపాడట. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే లవ్ స్టోరీ సినిమాలో తన లుక్ కు సంబంధించి డైరెక్టర్ కి చాలా సూచనలు ప్రభాస్ ఇచ్చినట్లు …ముఖ్యంగా కాస్ట్యూమర్ అలాగే మేకప్ ఆర్టిస్ట్ తో వర్క్ షాప్ కి ప్రిపేర్ అవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే త్వరగానే కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.