మోడీ పెద్ద మోసగాడు, రాహుల్ గాంధీ ఒక ఇడియట్ అంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి..!

వాస్తవం ప్రతినిధి: మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా వ్యవహరించిన జస్టిస్ మార్కెండేయ కట్జూ ఎప్పుడుఇ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. ఇటువంటి నేపథ్యంలో…గత కొంత కాలం నుండి సైలెంట్ గా ఉన్న జస్టిస్ మార్కెండేయ కట్జూ జాతీయ నాయకుల పై ట్విట్టర్ అకౌంట్ లో సంచలన పోస్ట్ పెట్టి విరుచుకుపడ్డారు. దేశ ప్రధాని మరియు కాంగ్రెస్ పార్టీ కేరళ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్ చేశారు. మోడీ పెద్ద మోసగాడు అంటూ జస్టిస్ మార్కెండేయ కట్జూ అన్నారు. అలాగే రాహుల్ గాంధీని ఒక ఇడియట్ గా అభివర్ణించారు. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఫ్రెంచి విప్లవం లాంటిది ఒకటి అవసరమని వ్యాఖ్యానించారు. దేశమంతటా చీకటి కమ్ముకున్న వేళ లో హోస్టన్ లో వెలుగులు అద్భుతమంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన తాజా ట్వీట్ తో ఆయనలోని విమర్శకుడు నిద్ర లేచాడా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లో ఆయన పోస్ట్ చేసే ట్వీట్లు.. ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.