కీలకంగా మారబోతున్న కెసిఆర్ తో జగన్ భేటీ…!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ చుట్టుపక్కల రాష్ట్రాలతో సత్సంబంధాలు చాలా మంచి వాతావరణంలో ఉండేలా చూసుకుంటున్నారు. వివాదస్పదమైన అంశాలకు తావులేకుండా తోటి రాష్ట్రాలతో సఖ్యత, ఐక్యతతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఇరు రాష్ట్రాలకు మేలు జరిగే అంశాలలో శాంతియుతంగా చర్చలు జరుపుతూ అనేకమైన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో మరోసారి జగన్ కెసిఆర్ లు భేటీ కావడం ఇప్పుడు కీలకంగా మారింది.వ్ హైదరాబాద్ లో ముఖ్యమంత్రులు కెసిఆర్ ,జగన్ లు భేటీ అయి విభజనకు సంబందించి పెండింగులో ఉన్న అంశాలను చర్చించవచ్చని బావిస్తున్నారు.దానికి తోడు గతంలో తీసుకున్న నిర్ణయాలు,వాటి అమలుపై కూడా దృష్టి సారిస్తారు. కృష్ణా,గోదావరి జలాల పై కూడా వారు చర్చిస్తారని సమాచారం వచ్చింది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, బిజెపి తో ఉన్న సంబంధాలు కూడా ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.