జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే లోకేష్ పరిస్థితి ఏంటి…?

వాస్తవం ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. తెలంగాణలో అయితే పార్టీ మూసే పరిస్థితి రాగా ఏపీలో కొనఊపిరితో మిగిలి ఉంది. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీలో చేరడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలి అంటే నాయకత్వం మారాలని సూచించిన క్రమంలో చంద్రబాబు ఇటీవల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు గురించి చర్చలు జరుపగా ఎక్కువగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర పైకి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే పార్టీని ఇంత దారుణమైన పరిస్థితులు నుండి పైకి తీసుకు రావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఖచ్చితంగా నందమూరి కుటుంబం హవా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుమూలంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో నందమూరి బాలకృష్ణ అల్లుళ్ళు లోకేష్, శ్రీభరత్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ కి బాధ్యతలు అప్పగించడం లేదని తెలుస్తుంది. కానీ టీడీపీ పార్టీ ఇటీవల తలపెట్టినటువంటి పల్నాడు ఉద్యమంలో కూడా నారా లోకేష్ చాలా విచిత్రమైన ధోరణిని కనబరిచాడు. అందుకనే లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆశ వదులుకోవాలని చంద్రబాబు కి సూచించారు. మొత్తం మీద ఈ పరిణామాలతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అని తేటతెల్లమవుతుంది. మరి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.