మోడీతో దీదీ భేటీ అయిన కారణం అదేనా ..?

వాస్తవం ప్రతినిధి: జాతీయ రాజకీయాల్లో మోడీతో మరియు అమిత్ షా తో ఢీ అంటే ఢీ అన్నట్టు గా వ్యవహరించింది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు వరకు బిజెపి పార్టీకి మమతా బెనర్జీ చుక్కలు చూపించింది. దేశవ్యాప్తంగా 2019 ఎన్నికల సమయంలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లో భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మోడీని మరియు అమిత్ షా ని అదేవిధంగా సీబీఐకి కూడా ఏమాత్రం బెదరకుండా అప్పట్లో మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది . ముఖ్యంగా శారదా చిట్ ఫండ్ కేసులో సీబీఐ అధికారులు రాష్ట్రంలో రాకుండా ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ వ్యవహరించిన తీరు అప్పట్లో అప్పట్లో జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం కేంద్రంలో రెండో సారి భారీ మెజార్టీతో మోడీ మరోసారి ప్రధాని కావడం హోంమంత్రిగా అమిత్ షా వ్యవహరిస్తున్న క్రమంలో మమతా బెనర్జీ మోడీతో ఢిల్లీలో భేటీ అవడానికి రెడీ అవుతున్నట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. అయితే వీరిద్దరి బేటి పశ్చిమబెంగాల్ రాష్ట్ర పేరు మార్చడానికి అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఆలస్యమవుతున్న నేపద్యంలో వాటి గురించి చర్చించడానికి మమతా బెనర్జీ మోడీతో భేటీ అయ్యారు అమ్మట్టు సమాచారం. కానీ మరోపక్క మమత బెనర్జీ మోడీతో భేటీ క్రమంలో పశ్చిమ బెంగాల్ బిజెపి పార్టీ నేతలు కార్యకర్తలు కేసుల విషయంలో మాఫీ చేసుకోవడానికి తనని తాను రక్షించుకోవడానికి మమతా బెనర్జీ మోడీ కాళ్లు పట్టుకోవడానికి వెళ్ళిందని విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా మమత మరియు మోడీల భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.