సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలి..: చంద్రబాబు డిమాండ్..!

వాస్తవం ప్రతినిధి: కోడెల శివప్రసాద్ మరణానికి గల కారణం రాజకీయ వేధింపులే అని ఇటీవల చంద్రబాబు రియాక్ట్ అయిన విషయం అందరికీ తెలిసినదే. ఏపీ లో ఉన్న వైసీపీ ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టింది, మానసికంగా కోడెల శివ ప్రసాద్ ని చంపించింది అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ధైర్యం జరిగిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేక వైసిపి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..కోడెల శివప్రసాద్ అని కావాలనే టార్గెట్ చేసి మానసికంగా వేధించి చంపారని…కోడెల మృతిపై సిపిఐతో ఎంక్వైరీ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు చేస్తే కచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కోడెల శివప్రసాద్ పై పెట్టిన అక్రమ కేసుల విషయంలో వైసీపీ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడుతూ…వైయస్ వివేకా హత్య కేసులు ఎందుకు ఇంకా చేయించలేక పోయారని తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఇప్పటికే బయట తిరుగుతున్నారని వాళ్లను ఎందుకు శిక్షించడం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదని ప్రజలంతా గమనిస్తున్నారని టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని చంద్రబాబు పేర్కొన్నారు.