బీజేపీ నేతలను రేపిస్టుల తో పోల్చిన కాంగ్రెస్ సీనియర్ నేత..

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ బిజెపి పార్టీ నేతల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే దిగ్విజయ్ సింగ్ డైరెక్టుగా రేపిస్టులు బిజెపి నేతలు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. విషయంలోకి వెళితే దిగ్విజయ్ సింగ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సంత్ సంగమ్ అనే ఓ ఆధ్యాత్మిక సంస్థ ‘ఆద్యాత్మిక వైభగ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం కమల నాథ్ తో పాటు దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అత్యాచారాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కసాయి వాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్లే ఎక్కువగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారని అఘాయిత్యాలకు పవిత్రమైన ఆలయాలనే వేదికగా చేసుకుంటున్నారని ఇటువంటి పనులు చేసే వారిని దేవుడు కూడా క్షమించడు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని దిగ్విజయ్ సింగ్ శాపనార్థాలు పెట్టారు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా సనాతన ధర్మాలను సంపూర్ణంగా మార్చివేస్తున్నారని కూడా బీజేపీపై నిందలేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం జై శ్రీరాం నినాదాన్ని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవానికి జై శ్రీరాం నినాదం… జై సియా రామ్ అని అయితే దానిని బీజేపీ నేతలు జై శ్రీరాంగా మార్చేశారని ఆయన విరుచుకుపడ్డారు.