హ్యూస్టన్ లో భారీ వర్షం.. సభ ఏర్పాట్లలో నిమగ్నమైన 1,500 మంది వాలంటీర్లు

వాస్తవం ప్రతినిధి: ఏడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాకు చేరుకొన్నారు. ఎన్నారైలతో తలపెట్టిన హౌడీ మోడీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మరో పక్క హ్యూస్టన్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వరదనీటితో ఉన్నాయి. టెక్సాస్‌ రాష్ట గవర్నర్‌ 13 కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దక్షిణ టెక్సాస్‌లో ప్రజలను బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం హౌడీ-మోడీ సభ జరిగే ఎన్ ఆర్ జి స్టేడియం కూడా వాన నీటితో నిండిపోయింది. దాదాపు 1,500 మంది వాలంటీర్లు సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. సభ ప్రారంభమయ్యే సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటున్నారు.