ఒకేరోజు బన్నీ- కళ్యాణ్ రామ్..!

వాస్తవం సినిమా: త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ అనే సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేయడానికి సినిమా యూనిట్ మొత్తం కష్టపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో సినిమా కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు రాబోయే దసరా నుండి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో దసరా రోజు విజయదశమి కానుకగా టీజర్ రిలీజ్ చేయడానికి త్రివిక్రమ్ -అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులను అలరించడానికి ఇప్పటి నుండే టీజర్ వర్క్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో పాటు కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ టీజర్ తో దసరాకి రాబోతున్నాడట. టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఓ థీమ్ టీజర్ వదిలిన మేకర్స్ ఇప్పుడు ఓ యాక్షన్ ఎపిసోడ్ తో టీజర్ రెడీ చేస్తున్నారట. సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినప్పటికీ యాక్షన్ కూడా ఉంటుందట. ఆ విషయాన్ని దసరా టీజర్ తో చెప్పబోతున్నారు. దీంతో దసరా కి టీజర్ రిలీజ్ చేసి ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అన్న దానిపై క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మొత్తంమీద దసరా రోజు బన్నీ కళ్యాణ్ రామ్ సినిమాల టీజర్స్ విడుదల కానున్నాయి.