తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.లక్షా 42వేల కోట్లు…కాగ్‌ నివేదిక

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లి ముందుకు కాగ్‌ రిపోర్టు వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కాగ్‌ రిపోర్టును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.లక్షా 42వేల కోట్లు ఉందని పేర్కొంది. రెవెన్యూ రాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19 శాతం ఉందని, వచ్చే ఏడేళ్లలో రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు రూ.65,740 కోట్లు ఉందని పేర్కొంది. వాస్తవానికి తెలంగాణ రెవెన్యూ లోటు రూ.284.74 కోట్లు ఉందని, ద్రవ్యలోటు రూ.27,654 కోట్లు ఉందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. క్యాపిటల్‌ వ్యయం విషయంలో తెలంగాణ ముందంజలో ఉన్నా విద్యారంగ కేటాయింపుల్లో వెనుకబాటు ఉందన్నారు.