ఇంకా రెండు సార్లు నేనే ముఖ్యమంత్రి అంటున్న కేసీఆర్..!

వాస్తవం ప్రతినిధి: అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ లో భాగంగా ఇటీవల కేసీఆర్ కేటీఆర్ కి మంత్రి పదవి కేటాయించటం పట్ల రకరకాల వార్తలు రావటం జరిగాయి. కెసిఆర్ ఆరోగ్యం క్షీణించడం వల్ల కేటీఆర్ ని రంగంలోకి దింపి త్వరలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెడుతున్నట్లు ..ఇలా అనేక రకాల వార్తలు రావటం జరిగాయి. దీంతో వస్తున్న వార్తలు విషయమై కె సి ఆర్ అసెంబ్లీ లో క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కెసిఆర్ మాట్లాడుతూ…కొంతమంది నా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ నాకు బాగోలేదని త్వరలోనే కేటీఆర్ ని సీఎం చేస్తున్నానని చాలా మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వచ్చిన వార్తల్లో అసలు వాస్తవం లేదని కేసీఆర్ గారు ఇచ్చారు. మరో పదేళ్లు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అని, నా వయసు ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు అయినా ఇంకా నేను రెండుసార్లు నేనే ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చురకలంటించారు. అంతేకాకుండా యురేనియం తవ్వకాలనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని.. ఇప్పటివరకు కేంద్రానికి అనుమతి ఇవ్వలేదని ఇక ఇవ్వమని ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారమే యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారానికి అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ తెరదించారు.