అధికార పార్టీలో కాపులకు పెద్ద దిక్కైన నాయకుడు..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన సామాజికవర్గం కాపు సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపీట వేస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చాలాసార్లు ఇటీవల రుజువు అయింది. ఇందు మూలంగానే 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు మాత్రం చంద్రబాబుకు ఓటు వేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు కాపులను బీసీ లో చేరుస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడంతో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని కూడా పట్టించుకోకుండా కాపులు జగన్ కి పట్టం కట్టారు. ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో కాపులకు పెద్దదిక్కుగా ప్రకాశం జిల్లా చీరాల నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ మారినట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది సీనియర్ నేతలు మాత్రం ఇంకా కొంతమంది నాయకులు ఉన్నాగాని జగన్ ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి విషయంలో ఆమంచి కృష్ణమోహన్ నీ ఇన్వాల్వ్ చేసి పార్టీలో ఆమంచి కృష్ణమోహన్ కి పెద్దపీట వేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులు తోట త్రిమూర్తులు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే తోట త్రిమూర్తులు వైసీపీ పార్టీలో రావటం వెనుక చక్రం తిప్పింది ఆమంచి కృష్ణమోహన్ అని పార్టీలో టాక్. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు పార్టీలో చేరిన సందర్భంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ చాలా మంది కాపు నేతలు ఆమంచికి టచ్ లో ఉన్నారని, వాళ్ళ విషయాలు ఆమంచి చూసుకుంటాడని మీడియా ముఖంగా చెప్పాడు. అంటే ‘ఆపరేషన్ ఆమంచి’ స్టార్ట్ అయ్యిందని అనుకోవాలి. కాపు నేతలను తీసుకొని రావటమే ఆమంచి ముందున్న కర్తవ్యమని తెలుస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే వైసీపీలో కాపు నేతలకి నాయకుడిగా ఆమంచి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.