జగన్ ని టెన్షన్ పెడుతున్న బాబాయ్ హత్య కేసు..?

వాస్తవం ప్రతినిధి: 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలైన సందర్భంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అధినేత జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించింది. ఆ సమయంలో వైసీపీ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావాలని జగన్ తన బాబాయ్ ని చంపి సానుభూతి రాజకీయాలకు తెరలేపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదే సందర్భంలో వైసీపీ నేతలు కడపలో వైయస్ వివేకానంద రెడ్డి బతికి ఉంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరదు అని, కావాలని హత్య చేయించారని ఆరోపించారు. అయితే ఈ క్రమంలో అధికారంలో ఉన్న జగన్ ని తన బాబాయ్ వైయస్ వివేకా హత్య కేసు టెన్షన్ పెడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసు విషయమై 25 మంది సభ్యులతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. అయితే అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా సొంత బాబాయి కేసునే చేదించలేకపోతున్నారంటూ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, నారా లోకేశ్, చంద్రబాబు నాయుడు సమయంవచ్చినప్పుడల్లా కేసు గురుంచి మాట్లాడుతూ వివేకా హత్య కేసును జగన్ సీబీఐకి ఎందుకు అప్పగించడంలేదో చెప్పాలని అడుగుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిజాలు భయటపెట్టలేకపోవడంతో బాబాయ్ కేసు కాస్త అబ్బాయ్ మెడకు చుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తంమీద వైయస్ వివేకా హత్య కేసు జగన్ ని అన్ని విధాల ఇరుకున పెడుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.